
హైదరాబాద్ కూకట్ పల్లిలో బతుకమ్మ పండుగ రెండు రోజుల ముందుగానే ప్రారంభమైంది. అమావాస్యకు రెండు రోజుల ముందుగానే వేడుకలను ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాల ప్రకారం కూకట్ పల్లిలో 2026 అక్టోబర్ 8న బతుకమ్మ సంబరాలు మొదలు పెట్టినట్లు తెలిపారు.
కూకట్ పల్లి ఆంజనేయస్వామి ఆలయం దగ్గర తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మ చుట్టూ చేరిన మహిళలు పాటలకు అనుగుణంగా బతుకమ్మ ఆడుతూ సంబరాలను ప్రారంభించారు. అనంతరం పిఎన్ఎం స్కూల్లో సైతం వేడుకలు నిర్వహించి రంగదాముని చెరువులో నిమజ్జనం చేశారు. కూకట్ పల్లి లోని మాధవరం కాలనీలో సైతం కాలనీవాసులు వేడుకలను ప్రారంభించారు.
ప్రతి ఏడు ఇలానే పండుగను జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు. 18వ తేదీన సద్దుల బతుకమ్మను ఐడిఎల్ చెరువు పైన పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.