Reading Time: < 1 minute
Gv Prakashs Big Bollywood Test Composing Full Album For Nayyi Navelli

సౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో జోష్ చూపిస్తున్నాడు స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి, మండాడి చిత్రాలతో హ్యాట్రిక్ నమోదు చేశాడు. సౌత్ ఓకే ఇక బాలీవుడ్‌లో ఫ్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. నేషనల్ అవార్డ్ యాక్ట్రెస్ యామీ గౌతమ్ మెయిన్ లీడ్‌లో నటిస్తోన్న నయీ నవేలి దసరా బరిలోకి దిగుతోంది. అక్టోబర్ 16న రిలీజ్ కానుంది హారర్ కామెడీ.

జీవీ ప్రకాష్‌కు బాలీవుడ్ కొత్తేమీ కాదు కానీ ఏ సినిమాకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా మ్యూజిక్ అందించలేదు. గతంలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రాలకు స్కోర్ ఇచ్చిన జీవీ.. జోకర్, అగ్లీ చిత్రాలకు కేవలం సాంగ్స్ సమకూర్చాడు. నయీ నవేలీ మాత్రం సాంగ్స్, స్కోర్ మొత్తం అతడే కంపోజ్ చేసాడు. ఈ మూవీని మరో నేషనల్ అవార్డ్ విన్నర్ ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నాడు. మారి ఫేం బాలాజీ మోహన్ నయీ నవేలితో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఇయర్ జీవీ ప్రకాష్‌కు స్పెషల్ ఇయర్. గత ఏడాది కంపోజింగ్ చేసిన సినిమాలేమీ బాక్సాఫీస్ దగ్గర ఫెర్ఫామ్ చేయలేదు. ఈ ఏడాది మాత్రం అతడి కంపోజింగ్ చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ బెండ్ తీశాయి. అలాగే అమరన్ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ కింద జాతీయ అవార్డ్ తీసుకున్నాడు. నయీ నవేలి సినిమా హిట్ అయి బాలీవుడ్ ఆఫర్స్ తెచ్చిపెడితే జీవీకి ఈ ఇయర్ మరింత స్పెషల్‌గా మారినట్లే.