Reading Time: < 1 minute
విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌.. తెలంగాణలో పెరిగిన కరెంట్‌ ఛార్జీలు

తెలంగాణలో విద్యుత్‌ వినియోగదారులపై ట్రూ-అప్‌ చార్జీల రూపంలో అదనపు భారం పడనుంది. 2022-24 మధ్యకాలంలో డిస్కమ్‌లు పెట్టిన అదనపు ఖర్చుల వల్ల ఏర్పడిన రూ.7,635 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు, వినియోగదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో TGSDCL పరిధిలోని కస్టమర్ల నుంచి రూ. 5,665 కోట్లు, TGNPDCL పరిధిలోని కస్టమర్ల నుంచి రూ. 1,969 కోట్లు వసూలు చేయడానికి విద్యుత్ సంస్థలు సిద్ధమయ్యాయి. మొత్తం లోటులో వ్యవసాయ విద్యుత్ వినియోగం వల్ల ఏర్పడిన రూ.2,214 కోట్ల భారాన్ని వినియోగదారులపై వేయకుండా, ప్రభుత్వమే స్వయంగా భరించేందుకు అంగీకరించింది. వ్యవసాయేతర వినియోగదారులకు మాత్రం ఈ ట్రూ-అప్ చార్జీల వసూళ్లు తప్పవు. సగటున 26 నెలల పాటు ఈ అదనపు భారం పడనుంది. నవంబర్ నెల నుంచి ప్రాథమికంగా యూనిట్‌కి 30 పైసల చొప్పున, ఆ తర్వాత డిసెంబర్ నెల నుంచి యూనిట్‌కి 50 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. పేద, మధ్యతరగతి మరియు వాణిజ్య వినియోగదారులపై నెలవారీ కరెంట్ బిల్లుల రూపంలో ఈ ప్రభావం స్పష్టంగా పడనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చదువుకుంటాను.. సాయం చేయండి!

డ్రైఫ్రూట్స్‌ ఆర్డర్‌ డెలివరీ.. క్షణాల్లో ఖాతా ఖాళీ

Elon Musk: మళ్లీ..ప్రపంచ ట్రిలియనీర్‌గా ఎలన్‌ మస్క్‌

వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. నెలరోజులు చాట్‌జీపీ ప్లస్‌ ఫ్రీ!

అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది