Reading Time: 2 minutes

అర్థరాత్రి ఫ్రెండ్ కు నానా పటేకర్ మెసేజ్.. ఉదయానికల్లా హఠాన్మరణం.. ఆ ఆఖరి సందేశంలో ఏముంది?

Caption of Image.

భారతీయ చిత్ర పరిశ్రమలో తన గంభేరమైన గొంతు, తీక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటుడు నానా పటేకర్ (75) గురువారం వేకువజామున గోవాలో కన్నుమూశారు.  అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న  ఈ దిగ్గజం.. ఒక్కసారిగా గుండెపోటుకు గురికావడం చలనచిత్ర రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.  దాదాపు ఐదు దశాబ్దాలుగా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన ఇకలేరన్న వార్త సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది.

ఆ రాత్రి ఏం జరిగింది?

గోవాలోని తన నివాసంలో ఉన్న నానా పటేకర్.. అక్టోబర్ 8 అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో తన ఆరోగ్యం బాగులేదని స్నేహితుడికి మెసేజ్ పంపారు. రాత్రి వేళ కావడంతో ఆ సందేశాన్ని గమనించని మిత్రుడు.. ఉదయం 4 గంటలకు ఆయన ఇంటికి చేరుకునేసరికి నానా పటేకర్ తీవ్రంగా చెమటలు పడుతూ అస్పృహస్యతలోకి జారుకుంటున్నారు. వెంటనే సమీపంలోనే ఉన్న కేర్‌టేకర్, మణిపాల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ బృందానికి సమాచారం అందించారు

వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ఆయన నాడి కొట్టుకోవడం ఆగిపోవడంతో, వెంటనే కార్డియాక్ మసాజ్ ప్రారంభించారు. ఉదయం 4:30 గంటలకు ఆసుపత్రికి తరలించి దాదాపు గంటపాటు శ్రమించినా ఆయన స్పందించలేదు. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు డాక్టర్ శేఖర్ సాల్కర్ ధృవీకరించారు. మెడికో-లీగల్ కేసు (MLC) కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి గోవా మెడికల్ కాలేజీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ప్రముఖుల అశ్రునివాళి..

ఆయన మరణవార్తతో సినీ, రాజకీయ రంగాల్లో విషాదం అలుముకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నానా పటేకర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన ప్రత్యేక నటనా ప్రతిభను తరతరాలు గుర్తుంచుకుంటాయని పేర్కొన్నారు. నటుడు అక్షయ్ కుమార్ సహా పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. రితేశ్ దేశ్‌ముఖ్ నానా మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. నటుడు మిథున్ చక్రవర్తి సైతం తన స్నేహితుడి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  ఇండియన్ సినిమా ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఆయన నటన తెరపై ఒక జీవన దృశ్యంలా ఉండేది అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

భారతీయ సినీ చరిత్రలో ఆయన పోషించిన పాత్రలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని సినీ , రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నానా పటేకర్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.. 

 

©️ VIL Media Pvt Ltd.