Reading Time: < 1 minute

సౌదీలోని మనోళ్లకు ముఖ్యమైన అలర్ట్.. పొరపాటున కూడా ఈ పనిచేయొద్దని ఇండియన్ ఎంబసీ సలహా

Caption of Image.

రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీల మిస్సైల్స్ దాడిని ధృవీకరించిన కొన్ని గంటల తర్వాత.. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సౌదీ అరేబియాలోని భారత పౌరులకు కీలక సలహా జారీ చేసింది. అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని.. స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ఆ సలహాలో కేంద్రం సూచించింది.

ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని రాయబార కార్యాలయం సూచించింది. జరుగుతున్న ఘటనలకు సంబంధించిన ఎలాంటి వీడియోలు లేదా వార్తలను ప్రచారం చేయడం లేదా రీపోస్ట్ చేయడం వంటివి చేయవద్దని రాయబార కార్యాలయం భారత పౌరులకు గట్టిగా సూచించింది.

రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ నిరంతరం అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశాయి. అవసరమైనప్పుడు తదుపరి అప్‌డేట్‌లు, సలహాలను జారీ చేస్తామని రాయబార కార్యాలయం తెలిపింది. ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం (PBSK) 24×7 హెల్ప్‌లైన్ టోల్-ఫ్రీ నంబర్ 8002471234లో అందుబాటులో ఉందని గుర్తుచేసింది.

ఎయిర్ ఇండియా, ఇండిగో, ఏఐ ఎక్స్‌ప్రెస్ రియాద్ విమాన సర్వీసులను అక్టోబర్ 10 వరకూ రద్దు చేశాయి. రియాద్, అభా విమానాశ్రయాలపై హౌతీలు బుధవారం జరిపిన దాడులలో ముగ్గురు మరణించారని సౌదీ అధికారులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.