Reading Time: 2 minutes

11 లక్షల కోట్లు ఉఫ్..సెన్సెక్స్ 1,045 పాయింట్ల పతనం

Caption of Image.
  • దలాల్ స్ట్రీట్​లో బ్లడ్ బాత్
  • ఈ ఏడాది కనిష్టానికి పడిపోయిన నిఫ్టీ
  • 12,944 కోట్ల షేర్లు అమ్మిన ఎఫ్ఐఐలు
  • క్రూడ్ ధరలు పెరగడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల 
  • పెంపుతో కుదేలైన స్టాక్​ మార్కెట్

ముంబై:  భారత్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టాలను మిగులుస్తున్నాయి.  గురువారం ఒక్క రోజే రూ.11 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గత  ఎనిమిది వారాల్లో ఏకంగా రూ.40–45 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ గురువారం తమ ఏడాది కనిష్టానికి పడిపోయాయి.  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో  కార్పొరేట్ కంపెనీల రుణ ఖర్చులు  పెరుగుతాయనే భయాలు నెలకొన్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం అంచనాలు పెంచడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.  మరోవైపు  ముడి చమురు ధరల మంట, ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు) వరుస సెషన్లలో అమ్మకాలు జరుపుతుండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నష్టపోతోంది.  

నిఫ్టీ-50 గురువారం  ఏప్రిల్ 2025 తర్వాత కనిష్ట స్థాయికి దిగజారింది. ఒకానొక దశలో 52 వారాల కనిష్టమైన 22,179 పాయింట్లకు పడిపోయి, చివరకు స్వల్పంగా కోలుకుని 22,232 వద్ద ముగిసింది. మరోవైపు సెన్సెక్స్ 1,045 పాయింట్లు పైగా   కుప్పకూలి 71,593 వద్ద స్థిరపడింది.  సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీసీ షేరు అత్యధికంగా 4శాతం పైగా క్షీణించగా.. ఇండిగో, పవర్ గ్రిడ్, బెల్, అదానీ పోర్ట్స్ షేర్లు దాదాపు 3శాతం మేర నష్టపోయాయి. రిలయన్స్, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ, టాటా స్టీల్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ వంటి దిగ్గజాలు 2శాతం దాకా పడిపోయాయి. బ్రాడర్ మార్కెట్లలోనూ అమ్మకాల వెల్లువ కనిపించింది.   నిఫ్టీ మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ 100 సూచీలు సైతం 3శాతం వరకు కుప్పకూలాయి. రంగాలవారీగా చూస్తే..  మెటల్, రియల్టీ సూచీలు 3శాతం పైగా పతనమయ్యాయి. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలో ఏకంగా 2,950 షేర్లు నష్టాల్లో ముగియగా, కేవలం 660 షేర్లు మాత్రమే లాభపడ్డాయి.    యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గేవరకు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐల అమ్మకాలు కొనసాగుతాయని, వాల్యూ స్టాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిక్స్డ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ మార్గాలే ఇన్వెస్టర్లకు  రక్షణగా నిలుస్తాయని సూచిస్తున్నారు.

పతనానికి ప్రధాన కారణాలు..

షాకిచ్చిన రేట్ల పెంపు: దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో కార్పొరేట్ కంపెనీల రుణ ఖర్చులు పెరగనున్నాయి. దీంతో వృద్ధి మందగిస్తుందనే భయాలు ఎక్కువయ్యాయి. మరోవైపు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  తన వైఖరిని ‘న్యూట్రల్’ నుంచి  ‘కఠినం’కు  మార్చడం మార్కెట్లకు షాకిచ్చింది. దీని అర్థం ఇప్పట్లో రేట్ల కోతలు ఉండవని, ఈ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో 100 బేసిస్ పాయింట్ల పెంపు ఉండొచ్చని జెఫరీస్, నొమురా వంటి సంస్థలు పేర్కొన్నాయి.
    
24 ఏళ్ల గరిష్టానికి బాండ్ ఈల్డ్స్:  అమెరికా 30 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5.71శాతం దాటగా, 10 ఏళ్ల ఈల్డ్ 5.30 శాతం పైకి ఎగబాకి 24 ఏళ్ల గరిష్టానికి చేరింది. సేఫ్టీ అసెట్ అయిన బాండ్లలో రాబడులు ఎక్కువగా ఉండడంతో ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెనక్కి వెళ్తున్నాయి. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు గురువారం ఒక్క సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.12,944 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.  గత తొమ్మిది వరుస సెషన్లలోనే  ఏకంగా రూ.57,000 కోట్ల విలువైన  షేర్లను విక్రయించారు. సెప్టెంబర్ నుంచి 25 సెషన్లలో 20 సార్లు వీరు నికర అమ్మకందారులుగానే ఉండటం  గమనార్హం. 
    
క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ 100 డాలర్లపైకి:  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ట్యాంకర్లపై దాడులు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ గురువారం 104 డాలర్లు దాటింది. ఇండియా కరెంట్ అకౌంట్‌పై ప్రభావం పడుతోంది.     డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూపాయి విలువ గురువారం 96.78  క్షీణించింది. 
    
యూఎస్ ఫెడ్ భయాలు: డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమెరికా ఫెడ్ మరోసారి రేట్లు పెంచే అవకాశం 80శాతం ఉందని సంకేతాలు రావడంతో గ్లోబల్ మార్కెట్లు పడుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.