Reading Time: < 1 minute
Mahindra Xuv 3xo Cng New Cng Suv Expected On October 15 Tata Nexon Rival

Mahindra XUV 3XO CNG: CNG వెర్షన్ కార్‌ మార్కెట్‌లో మారుతి, టాటా టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కార్ మేకర్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా సిద్ధమైంది. మహీంద్రా అక్టోబర్ 15న XUV 3XO CNG వెర్షన్‌ను తీసుకువస్తోందనే ప్రచారం జరుగుతోంది. మహీంద్రా తన కాంపాక్ట్ SUV కొత్త వెర్షన్‌ను అక్టోబర్ 15న విడుదల చేయనుంది. ఒక వేళ అది CNG వెర్షన్‌ విడుదల చేస్తే, మహీంద్రాలో నాలుగో పవర్ ట్రెయిన్ అవుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు CNG ఆప్షన్ కూడా అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.

CNG వెర్షన్‌ను మహీంద్రా విడుదల చేస్తే టాటా మోటార్స్‌తో నేరుగా పోటీలోకి వస్తుంది. టాటా మోటార్స్ వద్ద ఇప్పటికే నెక్సాన్, పంచ్ CNG వెర్షన్లు ఉన్నాయి. ఒకవేళ మహీంద్రా XUV3XO CNG విడుదల చేస్తే భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ప్రస్తుతం, మహీంద్రా XUV3XO రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఇది 111 hp పవర్ అందించే 1.2 MPFI టర్బో పెట్రోల్ ఇంజన్,131 hp శక్తిని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్లు ఉన్నాయి. ఈ రెండింటికి అదనంగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG ఇంజన్ ఆప్షన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే, కంపెనీ మాత్రం ఇప్పటి వరకు CNG గురించి అధికారికంగా ప్రకటించలేదు.