Reading Time: < 1 minute

ఇర్కుట్స్క్ నగరంలో ప్లేగ్ కేసు నమోదవలే..చనిపోయిన ల్యాబ్వర్కర్కు టీకా వేశామన్న రష్యా ఆరోగ్య శాఖ

Caption of Image.

మాస్కో: సైబీరియాలోని ఇర్కుట్స్క్​నగరంలో ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ల్యాబ్ వర్కర్ అంతుచిక్కని న్యూమోనియాతో మరణించగా.. న్యూమోనిక్ ప్లేగ్ అనుమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఆమె ద్వారా మరొకరికి ఇన్ఫెక్షన్ సోకిందని వస్తున్న వార్తలను రష్యా పబ్లిక్ హెల్త్ వాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాగ్​ ఖండించింది. ఇర్కుట్స్క్​ లో ప్లేగ్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసింది. చనిపోయిన ల్యాబ్​వర్కర్​కు టీకా వేశామని తెలిపింది. 

ఆమె మరణానికి అసలు కారణంపై స్పష్టత లేకపోవడంతో.. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అందించాలని రష్యాను డబ్ల్యూహెచ్​వో కోరింది. రష్యన్ అధికారులు ఈ అంశంపై గోప్యత పాటిస్తూ సమాచారాన్ని బయటకు రాకుండా చేశారు. రష్యా ప్రభుత్వ టీవీ, ఇతర జాతీయ మీడియా సంస్థలు కూడా దీనికి దూరంగా ఉన్నాయి.  

©️ VIL Media Pvt Ltd.