Reading Time: < 1 minute

పరిహారం తేల్చకుండా సర్వే ఎలా చేస్తరు?..గౌరవెల్లి 13 ఎల్ కుడి కాలువ భూసర్వేపై రైతుల ఆగ్రహం

Caption of Image.
  • పోలీసు బందోబస్తు మధ్య సర్వే 
  • రాస్తారోకోకు రైతుల యత్నం 
  • ఓ రైతును స్టేషన్‌‌‌‌కు తరలించిన పోలీసులు 

హుస్నాబాద్, వెలుగు: పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా, కనీసం ముందస్తు నోటీసులు జారీ చేయకుండా తమ భూముల్లో భూసర్వే ఎలా చేపడతారంటూ గౌరవెల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గురువారం గౌరవెల్లి ప్రాజెక్టు 13 ఎల్ కుడి కాలువ భూసర్వే ఉద్రిక్తతకు దారితీసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే పనులు ప్రారంభించడంతో రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని అభ్యంతరం తెలిపారు.

సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రైతులను పక్కకు నెట్టివేసినట్లు బాధితులు ఆరోపించారు. అధికారుల తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం కరీంనగర్‌‌‌‌-–హుస్నాబాద్‌‌‌‌ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని ఓ రైతును పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు తరలించారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.