
పండుగలు వస్తున్న వేళ బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు భారీ ఊరట కలిగింది. బంగారం ధరలు గత కొద్దికాలంగా పడిపోతూ వస్తోండగా.. శుక్రవారం కూడా అదే బాటలో నడిచాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు కుప్పకూలడంతో.. దేశంలోనూ ఆ ప్రభావం కనిపించింది. భారత్‌లోనూ శుక్రవారం గోల్డ్ రేట్లు డౌన్ అయ్యాయి. త్వరలో పండుగల సీజన్ వస్తున్న క్రమంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 9వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
ఇవాల్టీ బంగారం ధరలు ఇవే..
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,090గా ట్రేడవుతోంది.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,49,560గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,090 వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,49,560 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,090గా ఉంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,090 వద్ద ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,690గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,37,240 వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.35 లక్షలుగా ఉంది.
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,44,900గా ప్రస్తుతం ఉండగా.. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉంది.
-చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,44,900గాఉండగా.. నిన్న ఈ రేటు రూ.2.45 లక్షలుగా ఉంది.
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద ప్రస్తుతం కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2.35 లక్షలుగా ఉంది