Reading Time: < 1 minute
Christa Pike Survives Lethal Injection How Did Two Pentobarbital Doses Fail

Christa Pike:  అమెరికాలో టెన్నెసీ రాష్ట్రంలో ఒక మహిళకు మరణశిక్ష ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య కేసులో దోషిగా తేలిన ఖైడీ క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు చేసేందుకు 2 సార్లు ప్రాణాంతక విషపు ఇంజెక్షన్లు ఇచ్చినా ఆమె బతికే ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరణశిక్ష విధింపు ప్రక్రియ సమయంలో ఇంజెక్షన్లు ఇచ్చినా, ఆమె మరణించకపోవడంతో తిరిగి ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చిందని ఆమె న్యాయవాదులు తెలిపారు.

ఎలా బతికింది..?

పెంటోబార్బిటాల్ అనే విషపు ఇంజెక్షన్ శరీరంలోకి వెళ్లినా ఎందుకు మరణించలేదనే ప్రశ్న అందర్ని తొలిచివేస్తోంది. కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే ఈ ఇంజెక్షన్ పైన్ విషయంలో మాత్రం పనిచేయలేదు. ఈ మందు ఆమె శరీరంలోకి వెళ్లిందా? వెళ్లినా రక్తంలోకి తగిన మోతాదులో చేరిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.

నరాల్లోకి ఇంజెక్షన్ వెళ్లలేదా?

అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ జోయెల్ జివోట్ ప్రకారం.. పైక్‌కు ఇచ్చిన పెంటోబార్బిటాల్ పరిమాణం సాధారణంగా రక్త ప్రవాహంలోకి సరిగా చేరితే ప్రాణాంకతంగా మారుతుందని చెప్పారు. కానీ ఇంజెక్షన్ ఇచ్చిన ప్రాంతంలో పైక్ చేతులపై తీవ్రమైన వాపు, కాలిన గాయాలు కనిపించాయి. బొబ్బలు ఏర్పడ్డాయి. దీనిని బట్టి చూస్తే మందు నరాల్లోకి కాకుండా పక్కనే ఉన్న కణజాలంలోకి చేరి సంకేతాలు ఉన్నట్లు భావిస్తున్నారు. నరాల్లోకి చేరకుండా కణజాలంలోకి వెళ్తే రక్తంలో మందు ఒకేసారి చేరక ప్రాణం పోదని చెబుతున్నారు.

క్రిస్టా పైక్ ఉన్న ఈ సమస్యే కాపాడిందా?

క్రిస్టా పైక్‌కు ‘‘థ్రాంబోసైటోసిస్’’ అనే పరిస్థితి ఉందని ఆమె న్యాయవాదులు చెబుతున్నారు. ఇందులో రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుంది. ప్లేట్‌లెట్లు రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంజెక్షన్ ప్రాంతంలో క్లాటింగ్ సమస్య ఏర్పడి ఉంటే, మందు రక్తంలోకి సరిగా చేరకుండా ఉండే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

మందు నాణ్యతపై అనుమానాలు..

పైక్‌కు ఉపయోగించిన మందు నాణ్యతపై కూడా అనుమానాలు ఉన్నాయి. పెంటోబార్బిటాల్ మందు తయారీ, నిల్వ సమయంలో దెబ్బతిన్నదా? అనే సందేహాలు వస్తున్నాయి.