Reading Time: < 1 minute
ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!

Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన ఆటకి మరో నైపుణ్యాన్ని జోడించేందుకు సిద్ధమవుతున్నాడు. రంజీ ట్రోఫీ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ముంబై జట్టుతో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ జైస్వాల్ కనిపించడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. 24 ఏళ్ల జైస్వాల్ గ్లోవ్స్ ధరించి వికెట్ల వెనక కీపింగ్ సాధన చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అక్టోబర్ 11న వాంఖడే స్టేడియంలో చండీగఢ్‌తో ముంబై ఆడుతున్న తొలి రంజీ మ్యాచ్ కి అతడు అందుబాటులో ఉండనున్నాడు.

ఎక్కువమంది చదివినది: IND vs WI 2nd T20I: 2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. ఆ టీమిండియా డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ?

బ్యాటర్‌గా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటిన జైస్వాల్ గతంలో లెగ్ స్పిన్ కూడా ప్రయత్నించాడు. ఇప్పుడు వికెట్ కీపింగ్ పై దృష్టి పెట్టడం ద్వారా తన ఆటలో మరో కోణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నాడు. ముఖ్యంగా టీమిండియా బెంచ్ బలం కారణంగా కొత్త ఆటగాళ్లతో పోటీతత్వం పెరుగుతున్న నేపథ్యంలో టీమిండియాకు ఆల్ ఇన్ వన్ ప్లేయర్‌గా తీర్చిదిద్దుకునే క్రమంలో జైస్వాల్ ముందుకు సాగే ప్రణాళికలు చేసుకుంటున్నాడు.

ఎక్కువమంది చదివినది: IND vs WI: రాంచీలో శ్రేయస్ సేన సరికొత్త చరిత్రకు సిద్ధం..? ఇప్పటి వరకు ఎవరూ సాధించని రికార్డ్‌పై కన్ను!

ముంబై ప్రాక్టీస్ మ్యాచ్‌లో జైస్వాల్ సుమారు 10 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేసినట్లు తెలుస్తుంది. టీమిండియాకు కీపింగ్ చేసే సమయం వచ్చినప్పుడు తన వంతు పాత్ర పోషించేందుకు ఈ సాధన విలువైనదని భావిస్తున్నారు. ముఖ్యంగా అజింక్యా రహానే రిటైర్ కావడం, శార్దూల్ ఠాగూర్ జట్టుకు దూరంగా ఉండడంతో ముంబైకి జైస్వాల్ అనుభవం మరింత కీలకంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ నైపుణ్యాలతో టీమిండియాకు కూడా ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జైస్వాల్ ఆల్ ఇన్ వన్‌గా తయారవ్వాలనుకోవడం కీలక నిర్ణయంగా చెప్పవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..