
Naga Vamsi: ‘సర్దార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొ్న్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సూర్యతో తమ బ్యానర్‌లో సినిమా చేసి విజయాన్ని అందుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పుడు కార్తీ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘గజిని సూర్యను తీసుకొస్తామని చెప్పి ఎలా హిట్ కొట్టామో.. అలాగే మా నెక్ట్స్ సినిమాతో ఆవారా కార్తీని తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నా. గతంలో సూర్యగారు ముందుగా అన్నపూర్ణ బ్యానర్‌లో సినిమా చేసి ‘వీరభద్రుడు’తో హిట్ కొట్టారు. ఆ తర్వాత మా బ్యానర్‌లో కూడా మరో సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు. ఇప్పుడు కార్తీ కూడా అన్నపూర్ణ బ్యానర్‌లో ‘సర్దార్ 2’తో హిట్ కొట్టి.. ఆ తర్వాత మా బ్యానర్‌లో కూడా సక్సెస్ అందుకుంటారని నమ్ముతున్నా. ఆ లక్ మరోసారి రిపీట్ అవుతుందని భావిస్తున్నా’’ అని నాగవంశీ తెలిపారు.
మీకు స్పై చేసే ఛాన్స్ వస్తే ఎవరిని స్పై చేస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగవంశీ ఫన్నీ కామెంట్స్ చేశారు. హీరోయిన్ల బిజీ షెడ్యూల్స్‌పై ఆయన సరదాగా స్పందించారు. ‘‘నాకు స్పై చేసే అవకాశం వస్తే.. హీరోయిన్లు నిజంగానే బిజీగా ఉన్నారా? లేక అలా చెబుతున్నారా? అనేది తెలుసుకుంటా. ఎందుకంటే హీరో, డైరెక్టర్ లేని బిజీ వీళ్లకే ఉంటుంది’’ అంటూ స్టేజ్‌పై నవ్వులు పూయించారు. తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆశికా రంగనాథ్ మాత్రం అబద్ధం చెప్పరని నాగవంశీ అన్నారు. అయితే మాళవిక మోహనన్ విషయంలో తనకు తెలియదంటూ సరదాగా కామెంట్స్ చేశారు. పీ.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో కార్తీ, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.