
భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (National Film Awards) వేడుకకు సమయం ఆసన్నమైంది. అయితే ఈ సంబరాల వేదిక మారింది. గత 72 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని కెవాడియా వేదికగా సెప్టెంబర్ 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలకు పురస్కారాలు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ టు ఏక్తానగర్‌కు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 597 అడుగుల ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నీడన ఈ వేడుక జరగనుంది. దీంతో ఈ సారి ఏక్తా నగర్ సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. 1954లో ప్రారంభమైన నాటి నుంచి దాదాపు అన్ని అవార్డుల వేడుకలు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోనే జరిగాయి. అయితే ఈసారి ఆ సాంప్రదాయానికి స్వస్తి పలుకుతూ ఈ వేడుకను ఏక్తా నగర్‌కు తరలించారు.
ప్రధాన విజేతలు వీరే..
ఇకఈ ఏడాది ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో పలు ఆసక్తికర విజయాలు నమోదు అయ్యాయి. జాతీయ ఉత్తమ చిత్రంగాఆర్టికల్ 370 (Article 370), ఉత్తమ నటి గా యామీ గౌతమ్ (ఆర్టికల్ 370), ఉత్తమ నటులుగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (భ్రమయుగం), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్)లు అవార్డులు అందుకోనున్నారు..
ఉత్తమ అరంగేట్ర దర్శకుడుగా రణదీప్ హుడా (స్వాతంత్ర్య వీర్ సావర్కర్), ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ ఎపిక ‘ కల్కి 2898 AD ‘, ధనుష్ కథానాయకుడిగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ మూవీ కెప్టెన్ మిల్లర్ ఉత్తమ సామాజిక,పర్యావరణ చిత్రంగా ఎంపికైంది
72 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఢిల్లీ నుంచి ఏక్తానగర్‌కు మారింది. ఈ అపూర్వ ఘట్టం భారతీయ చిత్రసీమకు సరికొత్త అనుభూతిని అందించడమే కాకుండా, విజ్ఞాన్ భవన్‌ను దాటి ఒక పర్యాటక ప్రాంతంలో జరగడం వల్ల ఈ వేడుకకు సరికొత్త కళ వచ్చి చేరింది.