Reading Time: < 1 minute

పవర్‌ఫుల్ స్మగ్లర్‌గా మమ్ముట్టి, మాస్ లుక్‌లో ధనుష్.. నెట్టింట షేక్ చేస్తున్న ‘ఓమ్’ టీజర్!

Caption of Image.

 మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ( సెప్టెంబర్ 7, 2026 ) అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు అదిరిపోయే రేంజ్‌లో వస్తున్నాయి. ఇప్పటికే ‘మేళా’ ఫస్ట్ లుక్‌తో హైప్ పెంచారు. ఇప్పుడు ధనుష్‌తో కలిసి నటిస్తున్న ‘ఓమ్’తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.  లేటెస్ట్ గాఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.

‘అమరన్’ వంటి మూవీతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ‘ఓమ్’లో ధనుష్, మమ్ముట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్‌లో మమ్ముట్టి ఓ పవర్‌ఫుల్ స్మగ్లర్‌గా కనిపించడం సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. స్టైలిష్ డ్రెస్సింగ్, కళ్లలో కసి, గంభీరమైన డైలాగ్ డెలివరీతో ఆయన పాత్ర ఎంత డేంజరస్‌గా ఉండబోతోందో టీజర్ చిన్న శాంపిల్‌గా చూపించింది.

ఇక ధనుష్-మమ్ముట్టి కాంబినేషన్ సినిమాకు అసలు బిగ్ అట్రాక్షన్. ఇద్దరి మధ్య కనిపించిన ఇంటెన్సిటీ, ఢీకొనే చూపులు.. కథలో ఏదో భారీ గేమ్ నడుస్తోందనే ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా టీజర్ చివరిలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ అభిమానులకు మాస్ ట్రీట్‌గా మారింది.

ఈ మూవీలో సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. వండర్‌బార్ ఫిలిమ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత ఫైర్ జోడించింది.  దీంతో ఈ చిత్రంపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది

మరోవైపు మమ్ముట్టి స్వయంగా నిర్మిస్తున్న ‘మేళా’ కూడా ఆయన కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలవనుంది. నితీష్ సహదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆయన నిర్మాణ సంస్థలో 9వ ప్రాజెక్ట్ .. మొత్తానికి 75వ పుట్టినరోజు వేళ మమ్ముట్టి నుంచి ‘మేళా”.. ‘ఓమ్’ రూపంలో బ్యాక్ టు బ్యాక్ బొనాంజా. ఇక అక్టోబర్ 16, 2026న ‘ఓమ్’ థియేటర్లలోకి దిగితే.. ధనుష్, మమ్ముట్టి స్క్రీన్‌పై చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

 

©️ VIL Media Pvt Ltd.