వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లోకి ఎలుకలు, పాములు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎలుకలు.. ఇవి ఇంట్లో చేరి విలువైన పత్రాలను కొత్త బట్టలను నాశనం చేస్తాయి. అయితే వీటిని తరిమికొట్టేందుకు జనాలు అనేక రసాయనాలు, ఇతర ఉత్పత్తులను వాడి ఉంటారు. కానీ మన ఇంట్లో దొరికే సహజ వస్తువులతోనే వీటిని చంపకుండా శాశ్వతంగా తరిమికొట్టొచ్చని చాలా మందికి తెలియదు. అవును మన కిచెన్లో దొరికే పుదీన, బిర్యానీ ఆకు, వెల్లుల్లి ఎలుకలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
పుదీనా నూనె: ఇది ఎలుకలను తరమికొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు కొంచెంది దూది తీసుకొని దాన్ని ఉండలగా చేయండి. దానిని పుదీనా నూనెలో ముంచి మీ ఇంట్లో ఎక్కడైతే ఎక్కువగా ఎలుగుకలు తిరుగుతున్నాయో అక్కడ ఉంచండి. ఈ పుదీన నూనె నుంచి వచ్చే ఘాటైన వాసన ఎలుకలు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ఆ ప్రదేశాల్లోకి ఎలుకలు రాకుండా ఉంటాయి..
బిర్యానీ ఆకులు, లవంగాలు: ఇంట్లోని ఎలుకలను తరిమికొట్టేందుకు మనం వంటలో వాడే బిర్యానీ ఆకులు, లవంగాలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటి నుంచి వచ్చే ఘాటైన వాసన ఎలుకలకు ఊపిరితీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. కాబట్టి వీటిని ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో ఉంచడం ద్వారా అవి మళ్లీ ఆ ప్రాంతాల్లోకి రాకుండా పారిపోతాయి.
వెల్లుల్లి,వాడిన కాఫీ పొడి: అలాగే మనం రెగ్యులర్గా వాడే వెల్లుళ్లి, కాఫీ పొడితో కూడా మనం ఎలుకలను ఇంట్లో నుంచి వెళ్లగొట్టవచ్చు. ఇందుకోసం కాస్త వెళ్లుల్లి రసాన్ని ఒక దాదిపై పోసి దాన్ని ఇంట్లో ఎలుకలు తిరిగే ప్రదేశంలో ఉంచండి. లేదా మీరు ఒక చిన్న పాత్రలో కాస్త కాఫీ పైడర్ వేసి ఉంచినా వాటి నుంచి వచ్చే బలమైన వాసన వల్ల ఆ ప్రాంతాల్లోకి ఎలుకలు రాకుండా ఉంటాయి.
అమ్మోనియా ద్రావణం: ఇది కేవలం ఎలుకలే కాదు పాములను కూడా తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇందుకోసం మీరు ఇంటి గుమ్మం దగ్గర చిన్న డబ్బాలో అమ్మోనియా ఉంచితే, ఆ వాసన క్రూర జంతువుల మూత్రం వాసనలా ఉండటం వల్ల ఎలుకలు భయపడి పారిపోతాయి. ఈ చిన్న చిట్కాలు ఉపయోగించి మీరు ఈజీగా ఎలుకలను తరిమేవయ్యు!( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందిచబడినవి.. వీటిని Tv9 దృవీకరించడంలేదు.




