Reading Time: < 1 minute
Best Waterproof Phones Under 20000 Ip65 Rating

వర్షాకాలంలో ఫోన్లను నీటి నుంచి కాపాడుకోవడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. మీరు రూ.20,000 లోపు ధరలో డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్ (IP రేటింగ్) కలిగిన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కోరుకుంటుంటే కొన్ని సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి వర్షపు నీటి నుంచి రక్షణ ఇవ్వడమే కాకుండా పెద్ద బ్యాటరీ, మెరుగైన కెమెరా, మంచి పెర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి. రూ. 19,999 ధరకు లభించే వివో T5 లైట్ IP65 రేటింగ్‌తో వస్తుంది. ఇది ధూళి, నీటి చినుకుల నుండి రక్షణనిస్తూ, మిలిటరీ గ్రేడ్ బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో పాటు రోజంతా నిలిచేలా పెద్ద 6500mAh బ్యాటరీ ఇచ్చారు.

మోటోరోలా G37 పవర్ 5G మోడల్ రూ. 17,999 ధరకు అందుబాటులో ఉంది. ఇది IP64 రేటింగ్ , MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ మన్నికతో రూపుదిద్దుకుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో పాటు భారీ 7000mAh బ్యాటరీని అమర్చారు, ఇది బ్యాటరీ లైఫ్‌ను అత్యంత ముఖ్యంగా భావించేవారికి సరైన ఎంపిక. రియల్‌మి నార్జో 90x 5G ధర రూ. 17,499 గా ఉంది. ఈ ఫోన్‌లోని IP65 రేటింగ్‌తో పాటు ‘రైన్‌వాటర్ స్మార్ట్ టచ్’ ఫీచర్ వల్ల తడి చేతులతో కూడా స్క్రీన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో ఆటోఫోకస్, AI ఇమేజింగ్ సపోర్ట్ ఉన్న 50MP ప్రైమరీ కెమెరా మరియు 7000mAh బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

రెడ్‌మి 15C 5G (Redmi 15 5G) ఫోన్ రూ. 19,940 ధరకు లభిస్తోంది. IP64 రేటింగ్‌తో నీటి చుక్కల నుంచి రక్షణనిచ్చే ఈ ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. ఫోటోల కోసం వెనుక వైపు 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. చివరగా.. రూ. 17,999 ధరకు లభించే ఒప్పో K14x 5G కూడా వర్షాకాలపు వినియోగానికి తగినట్లుగా డిజైన్ చేయబడింది. ఇందులో రోజువారీ నీటి స్ప్లాష్‌లను తట్టుకునే రక్షణ , 50MP ప్రైమరీ కెమెరా లభిస్తాయి. వర్షంలో కూడా ధైర్యంగా ఫోన్ వాడాలనుకునే వారికి ఈ మోడల్స్ అన్నీ బడ్జెట్‌లో లభించనున్నాయి.