Reading Time: < 1 minute

కిచెన్‌లో జిడ్డు మరకలు, మురికిని క్లీన్ చేయాలా ? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో ఇట్టే వదిలించండి!

Caption of Image.

ఆరోగ్యానికి వంటగదికి చాలా సంబంధం ఉంది. కిచెన్ క్లీన్ గా ఉంటేనే ఇంట్లో ఉన్నవారంతా హెల్దీగా ఉంటారు. లేదంటే కొన్ని ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్లు పెరిగిపోతాయి. అందుకే ప్రతిరోజూ కిచెన్ ను క్లీన్ చేసుకోవాలి. అయితే చాలామంది కిచెన్ క్లీన్ చేయడం పెద్ద పని, ఎక్కువ టైమ్ పడుతుందని అనుకుంటారు. కానీ చిన్నచిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తే చాలా తక్కువ టైమ్ లోనే  వంటగదిని శుభ్రం చేసుకోవచ్చు.

కిచెన్ లో బ్యాక్టీరియా ఎక్కువగా సింకులపైనే ఉంటుంది. అందుకే రెగ్యులర్ గా వీటిని క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంట్లో స్టీల్ సింక్ ఉంటె వాటికి పట్టిన మురికిని బేకింగ్ సోడా ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు. ముందు సింకులపై చల్లి కాసేపు వాటిని వదిలేయాలి.ఈ టైమ్ లో  వేరే పనులు చేసుకోవచ్చు. కాసేపయ్యాక బ్రష్ తో బేకింగ్ సోడా చల్లిన ప్రదేశాల్లో రెండు నిమిషాలు రుద్దితే చాలు సింకులు నీట్ గా మారిపోతాయి.

స్టవ్ బర్నర్ పై ఉండే జిడ్డు మరకలు పోవాలంటే.. వాటిని అమోనియా, నీళ్లతో నింపిన జిప్ లాక్  బ్యాగ్ లో బర్నర్లు వేసి రాత్రంతా పక్కనపెట్టాలి. ఉదయం లేచాక వాటివి డిష్ వాషర్ తో శుభ్రం చేసుకోవాలి.

కటింగ్ బోర్డులు, చాకులు, పీలర్లు క్లీన్ చేయాలంటే రాళ్ల ఉప్పులో కాస్త నిమ్మరసం, నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ నీటిలో వీటిని వేసి ఒక గంటపాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మంచినీళ్లతో కడిగితే మెరిసిపోతాయి.

మైక్రోవేవ్ ఒవెన్ ని క్లీన్ చేయాలంటే ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి.. అందులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి కలపాలి. వీటిని హై టెంపరేచర్ లో మైక్రోవేవ్ లో మూడు నిమిషాల పాటు ఉంచాలి. హీటింగ్ టైమ్ అయిపోయినా కూడా చల్లారేంతవరకు ఒవెన్ లోనే ఆ గిన్నెను ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసేసి ఒవెన్ లోపల తడి బట్టతో క్లీన్ చేసుకోవాలి.
 

©️ VIL Media Pvt Ltd.