Reading Time: < 1 minute

నార్లాపూర్ బాహుబలి మోటార్లు ఆన్..చివ‌‌‌‌రి ఆయ‌‌‌‌కట్టుకూ సాగునీరందిస్తం: మంత్రి జూపల్లి

Caption of Image.
  •     ఉమ్మడి పాల‌‌‌‌మూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తం  
  •     గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఫైర్​ 

హైదరాబాద్/కొల్లాపూర్, వెలుగు: పాలమూరు– -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన రెండు బాహుబలి మోటార్లను మంత్రి జూపల్లి కృష్ణారావు  బుధవారం ప్రారంభించారు. ఈ మోటార్ల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్‌‌‌‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి పాల‌‌‌‌మూరు జిల్లాలోని ప్రాజెక్టుల‌‌‌‌ను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల‌‌‌‌మూరు– రంగారెడ్డి ఎత్తిపోత‌‌‌‌ల ప‌‌‌‌థ‌‌‌‌కం ప‌‌‌‌నుల‌‌‌‌ను పూర్తి చేయ‌‌‌‌కుండానే జాతికి అకింతం చేశార‌‌‌‌ని, కాలువ‌‌‌‌లు, డిస్ట్రిబ్యూట‌‌‌‌రీ కెనాల్స్, ఇత‌‌‌‌ర ప‌‌‌‌నుల‌‌‌‌ను గత ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. 

ప్రాజెక్టును గత పాలకులు పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.  మహాత్మాగాంధీ–కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 4.60 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా 2 లక్షల ఎకరాలు, భీమా ద్వారా 2 లక్షల ఎకరాలు, కోయిలాసాగర్ కింద 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు. ఇన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.