Reading Time: 2 minutes

దసరా 20నా 21వ తేదీనా : పండుగపై గందరగోళం ఎందుకు..?

Caption of Image.

ఈ ఏడాది (2026)  దసరా పండుగ విషయంలో గందరగోళంగా ఉంది.  ఎందుకంటే అక్టోబర్ 21న ‘ఉదయ తిథి’ (సూర్యోదయ సమయంలో ఉండే తిథి) ఉన్నప్పటికీ రావణ దహనానికి అవసరమైన ‘ప్రదోష ముహూర్తం’ ‘విజయ ముహూర్తం’ ఆ రోజున ‘దశమి తిథి’తో కలిసి రావడం లేదు. అక్టోబర్ 20న సూర్యోదయ సమయంలో దశమి తిథి లేదు. ఈ పరిస్థితుల్లో దసరాను ఎప్పుడు జరుపుకోవాలి? రావణ దహనం, శమీ పూజ, ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి.. పండితులు ఏమంటున్నారు .. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

దసరా పండుగను హిందువులు చాలా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.  ఇప్పటికే ( అక్టోబర్​ 13 నాటికి) నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పురాణాల ప్రకారం చెడుపై మంచి విజయం సాధించిన రోజున విజయదశమి పండుగ జరుపుకుంటారు.  

శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజుగా, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే 2026లో దసరా పండుగ అక్టోబర్ 20న జరుపుకోవాలా? లేక అక్టోబర్ 21నా? అనే సందేహం చాలామందిలో ఉంది. ప్రాంతీయ పంచాంగాలు, సంప్రదాయాల ఆధారంగా ఈ తేదీల్లో తేడా కనిపిస్తోంది.

దసరా 2026 ఎప్పుడు?

పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ( 2026) దసరా పండుగను అక్టోబర్​ 20న జరుపుకోవాలి. దశమి తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం ప్రారంభమై, అక్టోబర్ 21 మధ్యాహ్నం వరకు ఉంటుంది. 

 ఆశ్వయుజ శుక్ల పక్ష దశమి తిథి  ప్రారంభం: అక్టోబర్ 20  మధ్యాహ్నం 12 :50 గంటలకు  ఆశ్వయుజ  శుక్ల పక్ష దశమి తిథి  ముగింపు: అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 2:11 గంటలకు 

హిందువులు జరుపుకొనే పండుగలను తిథుల ఆధారంగా జరుపుకుంటారు.  కొన్ని పండుగలు బ్రహ్మ ముహూర్తంలో ఉన్న తిథి ఆధారంగా చేపుకొంటే మరి కొన్ని పండుగలు ప్రదోష కాలం( సాయంత్రం) తిథి ఉన్న సమయంలో చేసుకోవాలి.  

దసరా పండుగ విషయంలో అక్టోబర్​ 20 ఉదయం దశమి తిథి ఉండదు.  ప్రదోషకాలంలో మాత్రమే ఉంటుంది.  ఆయుధపూజ, రావణదహనం, శమీపూజను సాయంత్రమే నిర్వహించాలి.  అందుకే సాయంత్రం దశమి తిథి ఉన్న రోజు 20 వ తేదీ కాబట్టి ఆ రోజే పండుగను జరుపుకోవాలి. 

విజయదశమి రోజున పూజలు, శుభకార్యాలు నిర్వహించడానికి విజయ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో అపరాజితా దేవిని పూజించడం, శమీ వృక్షానికి పూజలు చేయడం వంటి సంప్రదాయాలు ఉన్నాయి.

©️ VIL Media Pvt Ltd.