
నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఎన్ఏబీసీఓఎన్ఎస్) ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి. బీమా రంగం, ఇన్సూరెన్స్ ఉత్పత్తుల రూపకల్పన తదితర విభాగాల్లో కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, అండర్‌రైటింగ్ మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 13.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nabcons.comను సందర్శించండి.