
ఢిల్లీ రోడ్లు జనసంద్రంలా మారాయి. ఓట్ చోర్.. గద్దీ ఛోడ్..జ్ఞానేష్ కుమార్ రాజీనామా నినాదాలతో మారుమోగి పోతున్నాయి. కన్నాట్ నుంచి సుప్రీం కోర్టు దిశగా వెళ్తున్న డెమొక్రసీ మార్చ్ లో ఇండియా కూటమి నేతలు చేయి చేయి కలపడంతో ఊహించని విధంగా సాగుతోంది.
2026 అక్టోబర్ 12న డెమొక్రసీ మార్చ్ పేరున ఇండియా కూటమి ఛలో సుప్రీం కోర్టు ర్యాలీని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముందుండి నడిపిస్తున్నారు. అడుగడుగునా శ్రేణులకు సలహాలు ఇస్తూ.. ముందుండి మార్చ్ ను విజయవంగంగా నడిపిస్తు్న్నారు. రాహుల్, ప్రియాంకతో కలిసి నేహాబొరా మార్చ్ లో పాల్గొన్నారు. మండి హౌస్, బరాఖంబా రోడ్ సమీపలో ఇసకేస్తే రాలనంత జనంతో మార్చ్ ముందుకు సాగింది.
కూటమి ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ర్యాలీ పార్గొన్నారు. భగవన్ దాస్ రోడ్డు దగ్గర నిరసనలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్, డీకే శివకుమార్, సుఖ్వీందర్ సింగ్,వీడీ సతీషన్, మంత్రులు పాల్గొన్నారు.
►ALSO READ | రాహుల్ గాంధీ పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు.. పిటిషన్లో 8 మంది పేర్లు
జాతీయ జెండాలతో, కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీల జెండాలతో కార్యకర్తలు కదం తొక్కారు. అదే విధంగా సర్ ప్రక్రియ అక్రమాలపై ఫ్లకార్డులను పదర్శి్స్తూ ముందుకు సాగారు. ఓట్ చోర్ దిగిపోవాలనే నినాదాలతో బరాఖంబా రోడ్లు దద్దరిల్లుతన్నాయి. సీఈసీ జ్ఞానేష్ రాజీనామా చేయాలని డిమాండ్ తో ఇండియా కూటమి నేతలు,శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.
మరోవైపు రాహుల్ గాంధీ ర్యాలీలో ఉండటంతో ఆయన లీగల్ టీమ్ సుప్రీకోర్టుకు చేరుకుని పిటిషన్ సమయాన్ని పొడిగించాలని కోరింది. అయితే రాహుల్ ర్యాలీలో ఉండటంతో ఆయన లీగ్ టీమ్ పిటిషన్ దాఖలు చేసింది.
The Congress party’s “March for Democracy” is underway in New Delhi, from Barakhamba Road towards the Supreme Court. Leading from the front are Rahul Gandhi and Priyanka Gandhi, with AISA national president Neha Bora walking alongside them. https://t.co/20yHNy1pCS
— Kumaon Jagran (@KumaonJagran) October 12, 2026