Reading Time: < 1 minute

ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయానికి భూమిపూజ

Caption of Image.

ఖమ్మం, వెలుగు : ఖమ్మం పరిధిలోని అల్లీపురంలో టీటీడీ అధ్వర్యంలో నిర్మిస్తున్న వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ ప్రారంభ కార్యక్రమం ఆదివారం మొదలైంది. టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కలెక్టర్ దివాకర, కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. రూ.89 కోట్ల టీటీడీ నిధులతో నిర్మిస్తున్న ఆలయానికి సోమవారం భూమిపూజ చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్న జీయర్ స్వామి హాజరుకానున్నారు. భూమిపూజ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం 20 వేల తిరుమల లడ్డూలు పంపిణీ చేస్తామని ఆఫీసర్లు చెప్పారు. సుమారు 30 వేల మంది భక్తులకు భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.