Reading Time: < 1 minute

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు : జైపూర్ లో అత్యవసరంగా ల్యాండింగ్

Caption of Image.

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో  జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.  గతంలో విస్తారా సర్వీస్‌కు చెందిన, ప్రస్తుతం ఎయిర్ ఇండియా నడుపుతున్న ‘AI 2030’ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం అందింది. దింతో అప్రమత్తమైన అధికారులు ఆ విమానాన్ని వెంటనే జైపూర్ విమానాశ్రయానికి మళ్లించి, సురక్షితంగా దించారు.

విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రయాణికులలో ఈ ఘటన కొంత ఆందోళన కలిగించింది. అయితే, బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది, విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు    అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  
 

©️ VIL Media Pvt Ltd.