Reading Time: < 1 minute
The Raja Saab Producer Tg Vishwa Prasad Blames Sankranti Release For Flop Talk

The Raja Saab : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రీమియర్స్ పడిన మొదటి ఆట నుంచే సినిమాకి నెగిటివ్ టాక్ బలంగా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. దీంతో సినిమా రిజల్ట్ అయితే చాలా వరకు తేడా కొట్టింది. అయితే ఈ విషయం మీద తాజాగా స్పందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వప్రసాద్.. తమ సినిమా కంటెంట్ బాగోకపోవడం కాదని, రిలీజ్ డేట్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

సంక్రాంతి సీజన్ కావడం వల్లే తమ సినిమా వర్కౌట్ అయి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో లాజిక్ లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కంటెంట్ అటూ ఇటూగా ఉన్నా కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు అద్భుతాలు సృష్టించాయి. కానీ ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో రావడం వల్లే అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదని విశ్వప్రసాద్ పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పోస్ట్‌మార్టం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించి ఉండాల్సిందని, ‘సీజన్ కరెక్ట్ కాదేమో’ అనే ఒక అభిప్రాయం సరైనది కాదేమో అని విశ్లేషకులు అంటున్నారు. అయితే మరి విశ్వప్రసాద్ ఏ అంశాలను బేరీజు వేసుకుని అలా అంచనాకు వచ్చారో మనకు తెలియదు కానీ, ఆయన మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.