
సోమవారం ఎలక్ట్రిక్ కారు (EV) వేగంగా ప్రయాణిస్తూ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. గొల్లపూడి నుంచి గన్నవరం వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఈవీ AP 40 EV 1112 కారులో తిరుగు ప్రయాణమయ్యారు.. ఈ క్రమంలోనే 10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా మృత్యువు వెంటాడింది.. మృతులు కొమ్మరెడ్డి రాందేవ్ రెడ్డి, కొమ్మరెడ్డి అరుణ, భీమవరపు విజయ , ఏడాది వయసున్న కొమ్మారెడ్డి మహత్రా ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన తిగురు అరుణ పరిస్థితి.. విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారు అద్దాలను పగలగొట్టి మృతదేహాలను బయటకు తీశారు. అయితే.. మృతదేహాల తరలింపులో గంటల తరబడి జాప్యం చోటుచేసుకుంది. సరిహద్దుల అంశం కారణంగా 2 గంటల పాటు వేచిచూసిన కొత్తపేట, భవానీపురం, ఇబ్రహీంపట్నం పోలీసులు.. గుంటూరు జిల్లా నంబూరూలో ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని.. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.. కాసేపట్లో తమ స్వగ్రామానికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగిందంటూ.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
విజయవాడ వెస్ట్ బైపాస్‌లో కారు దగ్దం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కారులో మంటలు చెలరేగి నలుగురు మృతి చెందడంపై సీఎం సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం చంద్రబాబు .. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ప్రమాదానికి గల కారణాలపై సీఎం ఆరా తీయగా.. రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొని కారులో మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.