Reading Time: < 1 minute

Rajinikanth Bus Conductor: స్టార్‌డమ్ కంటే కండక్టర్ జీవితమే ఇష్టం.. రజినీకాంత్ ఎందుకిలా అన్నారు?

Caption of Image.

వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు.. అభిమానులకు పండగే. ఆయన స్టైల్‌‌‌‌కు, మ్యానరిజమ్స్‌‌‌‌కు కోట్లాది మంది ఫిదా. సినిమాల్లో సూపర్‌‌‌‌స్టార్‌‌‌‌గా తిరుగులేని గుర్తింపు.. జీవితంలో అంతకుమించిన గౌరవం. కానీ ఇంతటి స్టార్‌‌‌‌డమ్‌‌‌‌ను సొంతం చేసుకున్న రజినీకాంత్ (Rajinikanth) మనసులో మాత్రం ఇప్పటికీ ఓ సాధారణ బస్ కండక్టర్ జీవితం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

తన సినీ ప్రయాణం కంటే, కండక్టర్‌‌‌‌గా పనిచేసిన రోజులను ఎక్కువగా ఇష్టపడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  ‘జైలర్ 2’ ప్రమోషన్స్‌‌‌‌లో నిర్వహించిన  కార్యక్రమంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. ఆయన అసాధారణ వినయం గురించి  అడిగాడు. అందుకు రజినీకాంత్ తన గతాన్ని గుర్తుచేసుకుంటూ, బెంగళూరులో ఐదేళ్లపాటు కండక్టర్‌‌‌‌గా పనిచేసిన రోజులను ఇప్పటికీ మిస్ అవుతున్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

‘నేను పెద్ద స్టార్‌‌‌‌‌‌‌‌నే కావచ్చు. నాకు నటన అంటే చాలా ఇష్టం. కానీ దానికంటే కండక్టర్‌‌‌‌గా ఉన్న రోజులను అంతకంటే ఎక్కువగా ఇష్టపడేవాడిని. నేను ఎప్పుడూ నన్ను ఒక స్టార్‌‌‌‌లా భావించుకోను’ అని ఆయన అన్నారు. అంతేకాకుండా తాను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా బెంగళూరు వెళ్లడానికి కారణం కూడా ఇదేనని చెప్పడం విశేషం. నన్ను నేను ఓ బస్ కండక్టర్‌‌‌‌లాగే చూసుకుంటాను కనుక మీలాంటి పెద్ద పర్సనాలిటీ ముందు.. ఓ సాధారణ కండక్టర్ ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఉంటాను’  అంటూ నవ్వులు పూయించారు. ఇక ఆయన హీరోగా నటించిన ‘జైలర్ 2’ సినిమా అక్టోబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

©️ VIL Media Pvt Ltd.