Reading Time: < 1 minute

పుణెలో విషాదం: వరకట్న వేధింపులు భరించలేక ఐటీ ఇంజనీర్ బలవన్మరణం!

Caption of Image.

మహారాష్ట్రలోని పుణెలో 33 ఏళ్ల ఐటీ ఇంజనీర్ త్రిష్ణ రాహుల్ సక్పాల్ తన ఇంట్లో  గత నెల (సెప్టెంబర్ 29న) ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె ఒక  సూసైడ్ నోట్  రాసిపెట్టింది. వరకట్నం కోసం భర్త, అత్తమామలు తీవ్రంగా వేధించడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో పేర్కొంది.

త్రిష్ణ తండ్రి బాలకృష్ణ నికమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… త్రిష్ణకు 2018లో రాహుల్ సక్పాల్‌తో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచే ఆమెపై అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. ఆమె సంపాదించే జీతం మొత్తం తమకే ఇచ్చేయాలని, ఆమె పుట్టింటి ఫ్లాట్‌ను అత్తగారి పేరిట రాయాలని, అలాగే మామగారి కోసం కోటి రూపాయల విలువైన ఫ్లాట్ కొనివ్వాలని ఒత్తిడి తెచ్చేవారు. శారీరక, మానసిక హింస తట్టుకోలేక త్రిష్ణ 2021లోనే (పెళ్లయిన మూడేళ్లకు) పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత ఆమె భర్త రాహుల్ మరో పెళ్లి చేసుకోవడం కోసం విడాకుల కేసు కూడా వేశాడు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.

సూసైడ్ నోట్ & పోలీస్ కేసు
ఆత్మహత్య చేసుకునే ముందు త్రిష్ణ రాసిన లేఖలో తన మరణానికి భర్త రాహుల్, అత్త వైశాలి, మామ సంజయ్, ఆడపడుచు శైలి, ఇంకా భర్త రాహుల్ నానమ్మ శకుంతల కారణమని వారి పేర్లను రాసింది. త్రిష్ణ తండ్రి ఫిర్యాదు అలాగే సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు భర్తతో సహా ఆ ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.