Reading Time: < 1 minute
Ysrcp Leaders Meet Guntur Sp Over Rowdy Sheets Ambati Rambabu

Ambati Rambabu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు పోలీసు సూపరింటెండెంట్‌ (ఎస్పీ)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరుస్తూ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మరికొందరిని బైండోవర్ చేసేందుకు పోలీసులు పిలుస్తున్నారని, ఈ చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలవడం, సంతకాల పేరుతో వారిని తీసుకెళ్లడాన్ని అంబటి రాంబాబు తప్పుబట్టారు. రౌడీషీట్లు తెరవడం లేదా బైండోవర్ చర్యలు చేపట్టడం జరిగితే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, కార్పొరేషన్‌, జిల్లా పరిషత్‌ (జెడ్పీ) ఎన్నికల్లో రెండు పదవులు మహిళలకు రిజర్వ్ అయ్యాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తామని వెల్లడించారు. పార్టీ క్యాడర్‌ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు..