తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టాలని కలలు కని, బుల్లితెరపై విలన్‌గా సంచలనం సృష్టిస్తున్న నటి గాయిత్రి సింహాద్రి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. విజయవాడకు చెందిన ఈ తెలుగమ్మాయి తన అద్భుతమైన నటనతోనే కాకుండా, గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామర్ పిక్స్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా టాలీవుడ్లో పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి నటీమణులు దిగుమతి అవుతుంటారు. అయితే స్వతహాగా విజయవాడకు చెందిన గాయిత్రి సింహాద్రి మాత్రం సినిమాల్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చారు. ‘మ్యాడ్’ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు చేసినప్పటికీ, ఆమెకు అసలైన గుర్తింపు మాత్రం బుల్లితెర ద్వారానే లభించింది. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరించిన సూపర్ హిట్ సీరియల్ ‘కార్తీక దీపం’ సీక్వెల్ అయిన ‘కార్తీక దీపం- ఇది నవ వసంతం’ లో ఆమె కీలకమైన విలన్ ‘జ్యోష్న’ పాత్రను పోషిస్తున్నారు.
ఈ సీరియల్లో ఆమె కన్నింగ్ లుక్స్, విలనీ స్మైల్ , నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. తెరపై ఆమెను చూస్తే ‘లాగి పెట్టి కొట్టాలనేంత’ సహజంగా నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నారు. సీక్వెల్ విజయానికి ఈమె పాత్ర కూడా ఒక ప్రధాన బలమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నటన పరంగా విలక్షణ పాత్రలు పోషిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో తనదైన గ్లామర్ టచ్‌తో నెటిజన్లను ఫిదా చేస్తున్నారు.
తెరపై పద్ధతిగా కనిపించే గాయిత్రి సింహాద్రి, రియల్ లైఫ్‌లో, సోషల్ మీడియా వేదికగా పంచుకునే గ్లామర్ ఫోటోలు యూవతను కట్టిపడేస్తున్నాయి. మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లో ఆమె పంచుకుంటున్న లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. నటనతో పాటు అందాల ఆరబోతలోనూ తగ్గేదేలే అంటున్న ఈ భామ రాబోయే రోజుల్లో వెండితెరపై పెద్ద ప్రాజెక్ట్‌లలో అవకాశాలు అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తెలుగునాట బుల్లితెర నుంచి సోషల్ మీడియా వరకు ట్రెండ్ అవుతున్న గాయిత్రి సింహాద్రి క్రేజ్ రోజురోజుకూ అంతకంతకూ పెరుగుతోంది. ఇదెలా ఉంటే.. మొన్నటి వరకు విలన్ పాత్రలో అదరగొట్టిన జ్యోత్స్న .. ఇప్పుడు పాజిటివ్ పాత్రలోకి వచ్చేసింది. ప్రాణంగా ప్రేమించిన సూరజ్ తనకు నమ్మకద్రోహం చేయడం.. జ్యోత్న్సలో విపరీతమైన మార్పు.. ప్రేమ కోసం తపించే అమ్మాయి పాత్రలో గాయత్రి సింహాద్రి నటన అద్భుతమనే చెప్పాలి. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్నే కథానాయికగా మారిపోయింది.




