Reading Time: < 1 minute

బీఆర్ ఎస్ నిర్లక్ష్యం వల్లే  నీటి తరలింపులో జాప్యం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Caption of Image.

 

  •     ‎ఏదుల నుంచి డిండి 
  • ఎత్తిపోతల పథకానికి నీరు : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

‎చండూరు, వెలుగు : ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్న మునుగోడు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రతినిధులతో ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి తరలింపుపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సరైన కార్యాచరణ చేపట్టకపోవడం వల్లే జాప్యం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక ఏదుల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించే విషయంపై నిర్ణయం తీసుకుందన్నారు. లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటిని తరలించే పనుల కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం సహా అవసరమైన పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నీటి తరలింపుపై వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతున్నప్పటికీ మునుగోడు ప్రజల నీటి అవసరాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేలా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్య నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడంతో పాటు రైతులకు సాగునీటి భరోసా కల్పించాలంటే ప్రాజెక్టుల నిర్మాణం, నీటి తరలింపు పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, సలహాదారులు వి.వెంకటరామారావు, ఎం.సత్తిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.