
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2026 అక్టోబర్ 14న జరిగిన ప్రమాదంలో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై సతీష్కు తీవ్ర గాయాలు అయ్యాయి.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎస్సై సతీష్ తీవ్ర గాయాలపాలయ్యారు.
గాయపడిన ఎస్సై సతీష్ ను మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.