Reading Time: 2 minutes

ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా ఓటమి.. WTC ఫైనల్ రేసులో భారత్‌కు కలిసొచ్చే అంశాలివే!

Caption of Image.

India WTC Final Race: దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయంతో ప్రారంభించింది. డర్బన్ వేదికగా కింగ్స్‌మీడ్ మైదానంలో ఈరోజు (2026 అక్టోబర్ 13, మంగళవారం) ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మాట్ రెన్‌షా సెంచరీతో పాటు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఏకంగా 6 వికెట్ల హాల్‌తో చెలరేగి సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

ఆస్ట్రేలియా విజయం భారత్‌కు కలిసొచ్చేనా?: 

డర్బన్ టెస్టులో సౌతాఫ్రికా ఓటమితో టీమిండియా శిబిరంలో కొంత ఊరట లభించింది. ప్రొటిస్ జట్టు ఓడిపోవడంతో వారి విజయాల శాతం (PCT) దెబ్బతిని 60 శాతానికి పడిపోయింది. సొంతగడ్డపై ప్రోటీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఎదురైన పరాజయంతో భారత్ కష్టాల్లో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం WTC ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ప్రతీ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది. చిన్న పొరపాటు జరిగినా ఫైనల్ వెళ్లే అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.

భారత్ ఆడే నెక్ట్స్ మ్యాచ్‌లు: 

* ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియా ఇంకా 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

* న్యూజిలాండ్‌తో వారి గడ్డపై 2 టెస్టులు

* బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టులు

* కొలంబోలో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత్.. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడంపై దృష్టి పెట్టాలి.. ఒకవేళ ఇండియా తన తదుపరి సిరీస్‌లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధిస్తే.. డైరెక్టుగా టాప్-2లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది.

WTC పాయింట్స్ టేబుల్: 

* ఆస్ట్రేలియా: ప్యాట్ కమ్మిన్స్ సేన 11 మ్యాచ్‌లలో 108 పాయింట్లతో, 81.82 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

* న్యూజిలాండ్: 72.22 శాతంతో రెండో స్థానంలో ఉంది.

*భారత్: ప్రస్తుతం 51.52 శాతంతో ఐదో స్థానంలో ఉంది.

సౌతాఫ్రికా తాజా ఓటమితో 60 శాతానికి పడిపోయింది. సౌతాఫ్రికాకు ఆస్ట్రేలియాతో మరో 2 టెస్టులు, అలాగే బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో సిరీస్‌లు మిగిలి ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా రేసులో ఉండటంతో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు రసవత్తరంగా మారింది.

©️ VIL Media Pvt Ltd.