Reading Time: < 1 minute

విజయవాడ బైపాస్‌లో ఘోరం.. రెయిలింగ్‌ను ఢీకొని తగలబడిన ఈవీ కారు.. నలుగురు సజీవ దహనం

Caption of Image.

విజయవాడ: విజయవాడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెయిలింగ్‌ను ఢీకొని ఈవీ కారు పూర్తిగా తగలబడింది. కారులో ఉన్న నలుగురు సజీవ దహనం కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కారులో ఉన్న మరొకరిని తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కారులో నుంచి బయట పడే లోపే మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. దిగే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న రాందేవ్ (39), అతని తల్లి అరుణ, విజయ అనే మహిళతో పాటు మరో చిన్నారి కూడా చనిపోవడం శోచనీయం.

​​​​సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో.. బేగంపేట్ విమానాశ్రయం సమీపంలోని పీఎన్‌టీ ఫ్లైఓవర్ దగ్గర ఎలక్ట్రిక్ బస్సుకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ అగ్నిప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బేగంపేట్, చుట్టుపక్కల ప్రాంతాల గుండా ప్రయాణించే ప్రయాణికులు అందుకు అనుగుణంగా ఆల్టర్నేటివ్ రూట్లలో వెళ్లారు.

©️ VIL Media Pvt Ltd.