
RC 17: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ అయి చాలా కాలమైంది. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే సుకుమార్ తో దాదాపుగా ఆయన సినిమా కన్ఫర్మ్ అయింది, కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. దసరాకి, 21వ తేదీన ఈ సినిమా ప్రారంభోత్సవం జరగవచ్చని అంచనాలు కూడా వెలువడ్డాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు సైలెంట్ గా పూర్తయ్యాయి.

ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అన్నీ సినిమా కోసం సిద్ధం చేసిన కొత్త ఆఫీసులోనే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక, ఈ సినిమాకి సుకుమార్ ఎప్పటిలాగే తన ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ ద్వారా నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సినిమా ఓపెనింగ్ సైలెంట్ గా పూర్తి చేసిన టీం, సినిమాకి సంబంధించిన వివరాలు కానీ ఇతర అంశాలు కానీ ఎప్పుడు బయట పెడతారు అనే విషయం మీద మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి కానీ, ప్రస్తుతానికి అధికారిక క్లారిటీ అయితే లేదు.