
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో రోడ్డుపై ప్రార్థన చేస్తున్న విద్యార్థినిని కారుతో ఢీకొట్టి చనిపోవడానికి కారణమైన కేసులో డ్రైవర్‌కు విధించిన జైలు శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది. నిందితుడి వయస్సు, ప్రవర్తన, పశ్చాత్తాపాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిందితుడి నుంచి రెండేళ్ల పాటు ఎలాంటి తప్పు చేయననే బాండ్ స్వీకరించి వదిలేసింది కోర్టు. జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చిన కోర్టు నిందితుడికి 10 ఏళ్ల పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధించింది.
అసలేం జరిగిందంటే..?
2025, మే 6న ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరం హిల్క్‌రెస్ట్ పరిధిలోని నార్త్ ఈస్ట్ రోడ్డుపై రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై కూర్చొని నమాజ్ చేస్తోన్న పాకిస్తాన్ సంతతి విద్యార్థిని సమియా మాలిక్ (20)ను అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సమియా అక్కడికక్కడే మరణించింది.
ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్‌ను ఆష్టన్ ఫ్రెండ్ (20)గా గుర్తించారు పోలీసులు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమవ్వడం, ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో ఆపకుండా వెళ్లిపోవడం వంటి నేరాలను ఆష్టన్ కోర్టులో అంగీకరించాడు.
►ALSO READ | ఆఫీసులో సహోద్యోగి వాటర్ బాటిల్లో విషం కలుపుతూ కెమెరాకి దొరికిపోయిన ఇంజనీర్! అమెరికాలో బయటపడ్డ నేరం!
తాను కంగారూ లేదా జంతువును ఢీకొట్టానని భావించానని.. మరుసటి రోజు వార్తల్లో చూసేంతవరకు అక్కడ మనిషిని ఢీకొట్టాననే విషయం తనకు తెలియదని కోర్టుకు తెలిపాడు. చీకట్లో తనకు మనిషి కనిపించలేదని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న దక్షిణ ఆస్ట్రేలియా జిల్లా కోర్టు 2026, అక్టోబర్‌లో ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది.
సమియా మృతికి కారణమైన ఆష్టన్కు 1 సంవత్సరం, 3 నెలల 29 రోజుల జైలు శిక్ష విధించారు. అయితే, నిందితుడి వయస్సు, ప్రవర్తన, పశ్చాత్తాపాన్ని పరిగణనలోకి తీసుకున్న నిందితుడు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. రెండేళ్ల పాటు ఎలాంటి తప్పు చేయననే వ్యక్తిగత బాండ్ స్వీకరించి ఈ నిర్ణయం తీసుకుంది. నిందితుడికి జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చిన కోర్టు 10 ఏళ్ల పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధించింది.