Reading Time: < 1 minute

మొలకలు వచ్చిన ఆలుగడ్డలతో వంట చేస్తున్నారా.. తినే ముందు ఈ విషయం తెలుసుకోండి!

Caption of Image.

మన ఇళ్లలో ఆలుగడ్డలు లేని వంటగది దాదాపుగా ఉండదు. కూర చేయాలన్నా, ఫ్రై చేసుకోవాలన్నా, స్నాక్స్ తయారు చేయాలన్నా ఆలుగడ్డలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆలుగడ్డలకు మొలకలు వస్తుంటాయి. చాలామంది ఆ మొలకలను తీసేసి యథావిధిగా వంటల్లో వాడేస్తుంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా?  మొలకలు వచ్చిన ఆలుగడ్డలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అసలు మొలకలు వచ్చిన ఆలుగడ్డల్లో ఎలాంటి హానికర పదార్థాలు ఉంటాయి ? వాటిని తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? మొలకలు వచ్చిన ఆలుగడ్డలను పూర్తిగా పడేయాలా ? ఇప్పుడు తెలుసుకుందాం!

కూరగాయల్లో ఆలుగడ్డలను స్పెషల్ గా స్టోర్ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఎక్కువ రోజులు వాడకుండా ఉంటే… వాటిపై మొలకలు వస్తుంటాయి. చాలామంది వాటిని తీసేసి వండుతారు కూడా. అయితే మొలకలు వచ్చిన ఆలుగడ్డలను వండు కోవద్దని చెప్తోంది అమెరికాకు చెందిన నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ అనే సంస్థ. సాధారణంగా ఆలుగడ్డలను తక్కువ మోతాదులో తీసుకుంటే, అందులోని సొలానైన్, చాకోనైన్ అనే పదార్థాలు బ్లడ్ షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతాయి. లేదంటే అవే పదార్థాలు బాడీలో ఎక్కువై విషంగా మారతాయి. అయితే మొలకెత్తిన ఆలుగడ్డల్లో ఈ సొలానైన్, చాకోనైన్ పదార్థాలు ఎక్కువ శాతం ఉంటాయి. దానివల్ల తలనొప్పి, లో-బీపీ, జ్వరం వంటి సమస్యలకు ఈ మొలకెత్తిన ఆలుగడ్డలు కారణమవుతాయి.
 

©️ VIL Media Pvt Ltd.