దసరా, దీపావళి పండగల ముందు పసిడి ప్రియులకు బంగారం ధరలు గుడ్న్యూస్ చెప్పాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు సడెన్గా దిగొచ్చాయి. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం ఉదయం 10 గంటల సమయానికి 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1000కి పైగా తగ్గగా.. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారంపై రూ.900కి పైగా దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,260 వద్ద ట్రేడవుతోంది.
ఇక బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,48,260గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,900 వద్ద ట్రేడవుతోంది. అలాగే ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో సైతం దాదాపు హైదరాబాద్ తరహా రేట్లే కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2,45,000 ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,48,410 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,36,050 గా ఉంది. అలాగే ముంబై, పుణె, బెంగళూరు వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,260గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,900 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది. ఇక చెన్నైలోనూ ఇదే తరహా రేట్లు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా నేడు బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ఆసియా-యూరోపియన్ ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పుంజుకోవడమే అని విశ్లేషకులు అంటున్నారు. అలాగే గత సెషన్లో ట్రేడర్లు స్వల్పకాలిక లాభాలను పొందడానికి అమ్మకాలకు మొగ్గు చూపారని.. తద్వారా బంగారం ధరలు దిగొచ్చినట్టు తెలిపారు.
అయితే పైన పేర్కొన్న ధరలు బుధవారం ఉదయం 10 గంటలకు నమోదైనవి మాత్రమే. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మారకం కారణంగా ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు రావచ్చు. కాబట్టి మీరు బంగారం లేదా వెండి కొనాలని చూస్తుంటే.. తాజా ధరల కోసం ఈ మొబైల్ నెంబర్కు (8955664433) మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు




