Reading Time: 2 minutes

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో హైదరాబాద్ లో భారీ మార్చ్

Caption of Image.
  •     నిరసన తేదీని త్వరలో ప్రకటిస్తాం
  •     పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 

న్యూఢిల్లీ, వెలుగు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, తొలగించిన  ఓట్లను పున:రుద్దరించాలని డిమాండ్ చేస్తూ… ఇండియా కూటమి చేపట్టిన ఉద్యమాన్ని ఇకపై  రాష్ట్రాలవారీగా విస్తరించనున్నట్లు పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌ వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌‌‌‌లో దసరా తర్వాత భారీ మార్చ్, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘ఇండియా కూటమి’ నేతలతో చర్చించి ఈ సభ నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో సునేహ్రీ బాగ్ (బంగ్లా నెంబర్ 5) లోని నివాసంలో  రాహుల్‌‌‌‌ గాంధీ విద్యార్థి సంఘాల నేతలు, సామాజిక వేత్తలు, ఇండియా కూటమి నేతలకు తేనీటి విందు ఇచ్చారు.

ఇందులో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ, సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డితో పాటు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి, చామల కిరణ్​కుమార్​రెడి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు పలువురు  పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని, ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నేతలకు  రాహుల్‌‌‌‌ దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్ అనంతరం పీసీసీ చీఫ్‌‌‌‌ మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. సర్ ప్రక్రియపై తమ అభ్యంతరాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాష్ట్రాలవారీగా నిరసనలు, మార్చ్‌‌‌‌లు చేపడతామన్నారు. హైదరాబాద్‌‌‌‌లో జరగనున్న మార్చ్, బహిరంగ సభకు సంబంధించిన ఇండియా బ్లాక్‌‌‌‌ పెద్దలతో చర్చించి పూర్తి వివరాలు, తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు. 

హైదరాబాద్​కు సీఎం, మంత్రులు 

‘హైదరాబాద్‌‌‌‌లో ఎన్ని ఓట్లు తొలగించారు? ఏయే ప్రాంతాల్లో ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి? వంటి వివరాలను లెక్కలతో సహా రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందరావు ముందు ఉంచేందుకు సిద్ధం’ అని మంత్రి పొన్నం చేసిన సవాల్‌‌‌‌ను మహేశ్‌‌‌‌ గుర్తు చేశారు. కాగా.. రాహుల్ తో తేనీటి సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు గడ్డం వివేక్, పొంగులేటి, జూపల్లి, ఇతర మంత్రులు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ 
బయలుదేరారు.
 
 

©️ VIL Media Pvt Ltd.