Reading Time: < 1 minute

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

Caption of Image.

కాచిగూడ డైల్వే స్టేషన్ లో ప్రమాదం తప్పింది. కదులుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కే ప్రయత్నంలో రైలు కింద పడబోయిన వ్యక్తిని చాకచక్యంగా కాపాడారు రైల్వే కానిస్టేబుల్ . 2026 అక్టోబర్ 13న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసి.. హమ్మయ్య బతికిపోయారు అంటున్నారు నెటిజన్లు.

కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి చేతిలో కూతురితో రైలు ఎక్కబోయాడు. పట్టుతప్పి రైలు కింద దాదాపు పడిపోయాడు. అప్రమత్తమైన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రీనాకుమారి  వ్యక్తిని కాపాడారు. వెంటనే వ్యక్తిని పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. 

అది గమనించిన లోకో పైలట్‌ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపారు. అప్పటికే వ్యక్తిని కాపాడారు కానిస్టేబుల్. ఆ తర్వాత భార్య, కూతురిని సురక్షితంగా రైలు ఎక్కించడంతో అందరూ ఊపిరి పీర్చుచుకున్నారు. కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. 

©️ VIL Media Pvt Ltd.