
Medha Meka Tollywood Debut: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ఒకప్పటి హీరోయిన్ ఊహల పెద్ద కుమారుడు రోషన్ మేక ఇప్పటికే హీరోగా సత్తా చాటుతున్నాడు. మొదటి సినిమా ‘పెళ్ళి సందడి’తో రోషన్ మంచి గుర్తింపు తెచ్చుకోగా.. ప్రస్తుతం నాలుగో సినిమా ‘ఏమో ఏమో ఇది’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు శ్రీకాంత్, ఊహల కుమార్తె మేధా మేక కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమాతో నాయికగా పరిచయమవుతున్నారు. ఈరోజు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పృథ్వి వనం దర్శకత్వం వహిస్తున్నాడు. పాపులర్ తెలుగు వెబ్ సిరీస్ ’30 Weds 21’కు దర్శకత్వం వచించాడు. జై జాస్తి, మేధా మేకా జంటగా నటిస్తున్న కొత్త సినిమా సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసి.. టైటిల్‌ను త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాను #MythriInLove అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రమోట్ చేస్తున్నారు. జై జాస్తి, మేధా తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారని చిత్ర బృందం వెల్లడించింది. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. టైటిల్ ప్రకటన ఎప్పుడు ఉంటుంది?, సినిమా కథాంశం ఏమిటి? అనే విషయాలపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నటనతో పాటు నేషనల్ లెవెల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా కూడా రాణించిన స్టార్ కిడ్ మేధాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆమె’ సినిమాతో ఊహ వెండి తెరకు పరిచయమైన విషయం తెలిసిందే.
#MythriInLove
A love story that begins with them and finds a place in you!
Meet #JaiJasti and #MedhaMeka, the two who’ve won our hearts and are all set to win yours!
Happy Falling in Love, Everyone!
Title Revealing Soon!
Produced by @MythriOfficial
Created by @filmymahesh
Directed by @prithvi_vanam— Mythri Movie Makers (@MythriOfficial) October 12, 2026


