Reading Time: 2 minutes

కండ్లు, చెవులు పోయేలా కొట్టారు.. విద్యార్థులపై పాశవికంగా దాడి: రాహుల్‌‌ గాంధీ ఫైర్‌

Caption of Image.
  • కేంద్రం, ఢిల్లీ పోలీసులపై రాహుల్‌‌ గాంధీ ఫైర్‌‌‌‌ 
  • ఓటర్ల జాబితాలో అక్రమాలపై గళమెత్తితే చిత్రహింసలు పెడ్తరా?
  • మోదీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవ్వరినీ వదలబోం
  • దెబ్బకు దెబ్బ కొడతాం అంటూ వార్నింగ్‌‌
  • బాధిత స్టూడెంట్స్‌‌తో కలిసి ప్రెస్‌‌మీట్‌‌

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య దేశ రాజధానిలో నిరసన గళాలపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ (సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అక్రమాలకు వ్యతిరేకంగా, ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా విరుచుకుపడ్డారని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

పోలీస్ కస్టడీలో విద్యార్థులపై సాగించిన పాశవిక దాడులను లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆధారాలతో సహా బయటపెట్టారు.  కేరళకు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆథిరపై ఖాకీలు సాగించిన దౌర్జన్యాన్ని మీడియా ముందుంచారు.

‘‘మహిళా పోలీసులు లేకుండానే నన్ను బస్సులోకి ఎక్కించారు. మహిళా కానిస్టేబుల్ ఎక్కడని ప్రశ్నించినందుకు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఆపి, ముఖంపై పిడిగుద్దులు కురిపించారు’’ అని ఆథిర కన్నీటిపర్యంతమైంది. పోలీసుల దాడిలో ఒక చెవి వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయిందని తెలిపింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘గతంలో పోలీసుల దెబ్బలకు కన్ను పోగొట్టుకున్న యువకుడిని చూపించాను..ఇప్పుడు ఈ విద్యార్థినికి ఒక చెవి పూర్తిగా వినిపించకుండా పోయింది. ఇదేనా మీ పాలన?” అని  రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు.

జుట్టు పట్టి ఈడ్చి.. చెవి పోగులు తెగేలా దాడి !
‘మా షేర్నీ’ (ఆడపులి) అని రాహుల్ పరిచయం చేసిన మరో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ మహిళా కార్యకర్త పోలీసుల కర్కశత్వాన్ని వివరించింది. చంచల్ యాదవ్ అనే మహిళా కానిస్టేబుల్ తన గొంతు నులిమి, సీటుపైకి విసిరికొట్టి, చెంపదెబ్బలు కొట్టడంతో చెవిపోగు తెగి చెవి లోపలికి దిగిపోయిందని గాయాలను చూపించింది. స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 107వ గదిలో మఫ్టీ పోలీసులు సైతం తనపై దాడికి తెగబడ్డారని వాపోయింది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 నుంచి 20 మంది పోలీసులు చుట్టుముట్టి కొట్టారని, లాఠీలతో మర్మాంగాలపై తన్నారని, మొబైల్ ఫోన్లు లాక్కుని ఆధారాలు లేకుండా ఫార్మాట్ చేశారని పలువురు విద్యార్థులు ఆరోపించారు.

బాధితుల సమక్షంలోనే సమర్ అనే  కళాకారుడు ‘వైష్ణవ జనతో’ భజనను ఫ్లూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆలపించగా.. ‘‘లాఠీల దెబ్బలకు సమాధానం ఫ్లూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే (దండే కా జవాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దండే సే)” అని రాహుల్ చురకలంటించారు.

‘‘అమిత్ షా జీ.. ఈ దృశ్యాలను బాగా చూడండి. ఇది భారతదేశపు గళం. మీ అణచివేతలకు విద్యార్థులెవరూ భయపడరు. పోలీసుల దౌర్జన్యాలకు సంబంధించిన ప్రతి వీడియోను భద్రపరుస్తున్నాం. సమయం వచ్చినప్పుడు మోదీ, షా, సీఈసీ నుంచి మా పిల్లలపై చేతులెత్తిన కానిస్టేబుల్ దాకా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరంగా ప్రతి ఒక్కరినీ బోనులో నిలబెడతాం’’ అని హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.