
Australia: నడిరోడ్డుపై నమాజ్ చేస్తున్న పాకిస్తాన్ విద్యార్థినిని కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత ఆపకుండా వెళ్లిన డ్రైవర్‌కు జైలు శిక్ష నుంచి ఊరట లభించింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో 2025లో మేలో జరిగింది. ఈ ఘటనలో 20 ఏళ్ల సమియా మాలిక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడు ఆష్టన్ ఫ్రెండ్‌కు డ్రైవర్‌కు కోర్టు జైలు శిక్ష విధించినప్పటికీ, న్యాయమూర్తి ఆ శిక్ష అమలును నిలిపివేశారు. అలాగే అతడిని పదేళ్లపాటు వాహనం నడపకుండా నిషేధించారు.
2025 మే 6న రాత్రి సుమారు 11 గంటల సమయంలో హిల్‌క్రెస్ట్‌లోని నార్త్ ఈస్ట్ రోడ్డుపై సమియా మాలిక్ మోకాళ్లపై కూర్చొని ఉంది. ఆమె సుమారు నాలుగు నిమిషాల పాటు అక్కడే ఉన్నట్లు కోర్టుకు సమర్పించిన వివరాలు వెల్లడించాయి. సీసీటీవీ దృశ్యాల్లో ఆమె చేతులు ప్రార్థిస్తున్నట్లుగా కనిపించాయని జడ్జి అన్నే బార్నెట్ పేర్కొన్నారు. ఆ రాత్రి సమియా రోడ్డుపై ఎందుకు కూర్చుందనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అదే సమయంలో కొన్ని వాహనాలు ఆమెను తప్పించుకుని వెళ్లినట్లు కోర్టులో ప్రస్తావించారు.
ఆష్టన్ ఫ్రెండ్ తన స్నేహితురాలి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా సమియాను ఢీకొట్టాడు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం ద్వారా మరణానికి కారణమవ్వడం, ప్రమాదస్థలం నుంచి పారిపోవడం వంటి నేరాలనున అతను అంగీకరించాడు. అయితే, ఫ్రెండ్ ఒక వ్యక్తిని ఢీకొట్టినట్లు గ్రహించలేదని ఆయన జెన్ అబ్బే కేసీ వాదించారు. అతను ఒక పెద్ద శబ్ధం విని, రోడ్డుపై ఏదైనా జంతువు లేదా ఏదైనా వస్తువును ఢీకొట్టినట్లు భావించాడని ఆమె కోర్టుకు చెప్పారు. తన కారుకు నష్టం పెద్దగా జరగకపోవడం వల్ల మనిషిని ఢీకొట్టినట్లు భావించలేదని అబ్బే తెలిపారు.
ప్రమాద సమయంలో ఫ్రెండ్ మద్యం సేవించలేదని, అతివేగంతో నడవపలేదని కోర్టుకు తెలిపారు. సమియా మాలిక్ మరణంపై వార్తా నివేదిక చూసిన తర్వాతే ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడని వెల్లడించారు. సంఘటన జరిగిన వారం తర్వాత పోలీసులు ఫ్రెండ్‌ను అరెస్ట్ చేశారు. సమియా మాలిక్ మరణం తనకు తీవ్ర దుఃఖానికి, మానసిక క్షోభను కలిగించిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సమీయా కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు.