Reading Time: < 1 minute
India Vs West Indies 4th T20i Hyderabad Preview 300 Runs Record

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌లో భాగంగా నాల్కో మ్యాచ్ నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులు నమోదయ్యే అవకాశం ఉందని, సరికొత్త రికార్డులు సృష్టించబడే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఇదే మైదానంలో బంగ్లాదేశ్‌పై భారత్ 297/6 పరుగుల భారీ స్కోర్ సాధించి, తమ అత్యధిక టీ20 అంతర్జాతీయ స్కోర్ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఏకంగా 300 పరుగుల మార్క్‌ను అందుకుంటుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఈ మ్యాచ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు వెస్టిండీస్ జట్టుక సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సి ఉంటుంది. కరీబియన్ బ్యాటర్ల దూకుడును బట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉండటం, ఒకవేళ మ్యాచ్ సమయంలో మంచు ప్రభావం ఉంటే బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. ఇది బ్యాటర్లకు మరింత కలిసివచ్చే అంశం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ఆటగాళ్ల నుంచి మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చు. బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్. మొత్తానికి.. వాతావరణం సహకరిస్తే అభిమానులకు అసలైన పరుగుల విందు దొరకడం ఖాయం. మరోవైపు వెస్టిండీస్ కూడా బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉండటంతో మ్యాచ్ చివరి వరకు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ తన మునుపటి రికార్డును తిరగరాస్తుందా లేదా అనేది చూడాలి.