Reading Time: < 1 minute

బౌరంపేట్ భూ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు : విప్ బల్మూరి వెంకట్ 

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా బౌరంపేట్ భూ వివాదంతో తనకు సంబంధం లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్‌‌‌‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా అనవసరంగా తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బల్మూరి వెంకట్ హెచ్చరించారు.

బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేయడంతో పాటు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.