Reading Time: < 1 minute

కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై.. రేపటి (అక్టోబర్ 15) నుంచి టోల్ ట్యాక్స్ వసూలు

Caption of Image.

కరీంనగర్: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై రేపటి (అక్టోబర్ 15) నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేశారు. హుజురాబాద్ సమీపంలోని కొత్తగట్టు దగ్గర టోల్ ప్లాజా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కారు, జీప్, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్కు సింగిల్ జర్నీకి 160 రూపాయలు, ఒకేరోజులో రిటర్న్ జర్నీతో కలిపి 235 రూపాయల టోల్ ఫీజును నిర్ణయించారు.

లైట్ కమర్షియల్ వెహికల్, లైట్ గూడ్స్ వెహికల్, మినీ బస్ అయితే సింగిల్ జర్నీకి 255 రూపాయలు, రిటర్న్ జర్నీతో కలిపి అయితే 380 రూపాయలు. బస్ లేదా ట్రక్ అయితే సింగిల్ జర్నీకి 535 రూపాయలు, సింగిల్ డేలో రిటర్న్ జర్నీతో కలిపి 800 రూపాయలు వసూలు చేయనున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించే నాన్ కమర్షియల్ వెహికల్స్ కు మంత్లీ పాస్ ఫీజును 360 రూపాయలుగా నిర్ణయించారు.

©️ VIL Media Pvt Ltd.