Reading Time: < 1 minute

కుమ్రంభీం జిల్లాలో ఎస్సై అరెస్ట్

Caption of Image.

కుమ్రంభీం జిల్లాలో ఎస్సైని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. సిర్పూర్ టి నియోజవర్గంలో ఎస్సైగా విధులు నిర్వహించిన ఎస్సై వెంకటేష్ ను 2026 అక్టోబర్ 12 (సోమవారం) అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

అక్రమ వసూళ్లకు ‌పాల్పపడ్డారనే ఆరోపణలపై ఎస్సై  వెంకటేష్ ను  అరెస్టు చేశారు పోలీసులు. పశువుల అక్రమ రవాణా, నకిలీ విత్తనాల కేసుల్లో వసూళ్లకు పాల్పపడ్డారని ఆయనపై  కేసు  నమోదయ్యింది. 

 సిర్పూర్ టి నియోజకవర్గం టాస్క్ పోర్స్  ఎస్సైగా పనిచేస్తూ వసూళ్లకు పాల్పపడ్డారని ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. 

ఎస్సై అక్రమ వసూళ్లకు సంబంధించి గతంలోనే పలు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఆరోపణలు రుజువు కావడంతో 2026 ఏప్రిల్ లో ఆయనను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.  

గతంలో కాగజ్ నగర్ లో టాస్క్ ఫోర్స్ ఎస్సైగా  విధులు నిర్వహించిన సమయంలో.. వెంకటేష్ తీవ్రమైన అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మట్కా నిర్వాహకులు, పశువుల అక్రమ రవాణా చేసే ముఠాతో చేతులు కలిపి వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఎస్సై తెలివిగా  వ్యవహరించినప్పటికీ ఫోన్ కాల్స్ డేటా, అలాగే ఫోన్ పే ద్వారా జరిగిన నగడు బదిలీల ఆధారంగా ఆయనను పట్టుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.