
రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ , విభాగానికి చెందిన ‘జియో ప్లాట్ఫార్మ్స్’ (Jio Platforms) ఐపీఓ (IPO)కి రావడానికి సిద్ధమవుతోంది. ఇది భారత మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద IPOగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐపీఓ ప్రారంభం కాకముందే గ్రే మార్కెట్లో జియో షేర్లపై విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) దాదాపు రూ.200 వద్ద వర్తకమవుతోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జియో ప్లాట్ఫార్మ్స్ ఈ ఐపీఓ ద్వారా మార్కెట్ నుంచి దాదాపు రూ. 30,200 కోట్లు నిధులు సమీకరించాలని యోచిస్తోంది.
గతంతో పోలిస్తే జియో విలువ ఎందుకు తగ్గింది?
నివేదిక ప్రకారం, జియో విలువ గతంలో అంచనా వేసిన దానికంటే ఇప్పుడు తక్కువగా ఉంది. దీనికి ఒక కారణంగా స్టాక్ మార్కెట్ అస్థిరత, పెద్ద ఐపీఓల పట్ల పెట్టుబడిదారుల ఆసక్తిలో మార్పులను పేర్కొన్నారు. జూన్‌లో కంపెనీ తన తొలి ఐపీఓ పత్రాలను దాఖలు చేసినప్పుడు, దాని విలువ సుమారు $131 బిలియన్లు, లేదా దాదాపు రూ.13 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు నివేదిక దాని విలువను సుమారు $106 బిలియన్లు, లేదా రూ.10.3 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అయితే ఈ మార్పుపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
జియో ఐపీఓ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
లైవ్‌మింట్ నివేదిక ప్రకారం, జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగియనుంది. షేర్లు అక్టోబర్ 28న లిస్ట్ కానున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. అయితే, ఈ తేదీలు, ధరలకు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తోంది.
ఐపీఓ నిధులను కంపెనీ దేనికి ఉపయోగిస్తుంది?
ఈ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులలో దాదాపు రూ. 27,500 కోట్లను తన టెలికాం సబ్సిడరీ సంస్థ అయిన ‘రిలయన్స్ జియో ఇన్ఫోకామ్’ రుణాలను చెల్లించడానికి ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. దీనివల్ల కంపెనీపై రుణ భారం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, ఇందులో కొత్త షేర్లను జారీ చేయనున్నారు.
ఈ IPO ఎందుకు అంత ప్రత్యేకం?
- విస్తృతమైన కస్టమర్ బేస్: మార్చి నాటికి జియో ప్లాట్‌ఫార్మ్స్‌కు దాదాపు 52.44 కోట్ల వినియోగదారులు ఉన్నారు.
- వ్యాపార విస్తరణ: జియో కేవలం మొబైల్ నెట్‌వర్క్‌కే పరిమితం కాకుండా ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్, క్లౌడ్ సేవలు, ఎంటర్టైన్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాలలో విస్తరించింది.
- ఆదాయంలో పెరుగుదల: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 14.6% పెరిగి రూ.1.47 లక్షల కోట్లకు చేరగా, నికర లాభం 15.1% పెరిగి రూ.30,050 కోట్లకు చేరింది. ఈ ఐపీఓ విజయవంతంగా లిస్ట్ అయితే, మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) పరంగా ఇది భారతదేశంలోని టాప్-4 అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా చేరే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Electric Blankets: ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్..!
ఇది కూడా చదవండి: MDR Charges: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం.. యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ ఛార్జీలు వాయిదా
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి