Reading Time: < 1 minute

ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్‌‌‌‌లోనే స్మృతి మంధాన 

Caption of Image.

దుబాయ్‌‌‌‌: ఇండియా విమెన్స్‌‌‌‌ జట్టు కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌ను మరింత పదిలపరుచుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో మంధాన 790 రేటింగ్‌‌‌‌ పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను సుస్థిరం చేసుకుంది. మాజీ కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (652) తొమ్మిదో ర్యాంక్‌‌‌‌లో కొనసాగుతోంది. బౌలింగ్‌‌‌‌ జాబితాలో ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ దీప్తి శర్మ ఒక్క స్థానం కోల్పోయి 9వ ర్యాంక్‌‌‌‌కు పడిపోయింది.

టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌లో షెఫాలీ వర్మ (795), స్మృతి మంధాన (754), హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (656) వరుసగా 4, 5, 10వ ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌‌‌‌లో శ్రీ చరణి (817), దీప్తి శర్మ (754) తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. టీ20 ఆల్ రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ నాలుగో స్థానంలో ఉండగా, వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. టీ20, వన్డే జట్ల ర్యాంకింగ్స్‌‌‌‌లో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. 

©️ VIL Media Pvt Ltd.