
India vs West Indies 4th T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. షాయ్ హోప్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ వేగంగా పరుగులు సాధిస్తూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 03 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. భారత్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
వెస్టిండీస్ బ్యాటర్లు తొలి ఓవర్ల నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కేవలం ఎనిమిది ఓవర్లలోనే జట్టు స్కోరు 110 పరుగులకు చేరింది. భారీ షాట్లతో పరుగుల వరద పారించిన విండీస్ బ్యాటర్లు భారత జట్టుకు సవాల్ విసిరారు. భారత్కు తొలి వికెట్ అక్షర్ పటేల్ బౌలింగ్లో లభించింది. జ్యువెల్ ఆండ్రూను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి విండీస్ జోరుకు బ్రేక్ వేశారు. ఆండ్రూ 16 బంతుల్లో 21 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. తొమ్మిదో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ కీలక వికెట్ సాధించాడు. ప్రమాదకరంగా ఆడుతున్న షిమ్రాన్ హెట్మయర్ 11 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. తక్కువ బంతుల్లోనే వేగంగా పరుగులు సాధించిన హెట్మయర్ను ప్రిన్స్ యాదవ్ నిలువరించడంతో భారత్కు రెండో వికెట్ లభించింది. అయితే అప్పటికే వెస్టిండీస్ స్కోరు భారీ స్థాయికి చేరుకుంది.
అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రోవ్మన్ పావెల్ 17 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో వెస్టిండీస్ మూడు వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లోనే ఈ సిరీస్లో తన రెండో సెంచరీని పూర్తి చేశాడు. దీనితో హోప్ చరిత్ర సృష్టించాడు. క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి, వెస్టిండీస్ తరఫున టీ20లలో అత్యధిక సెంచరీలు (3) చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ కూడా 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేశాడు.